పలు నియోజకవర్గాల్లో మంత్రి పొంగులేటి పర్యటన

పలు నియోజకవర్గాల్లో మంత్రి పొంగులేటి పర్యటన

ఖమ్మం కార్పొరేషన్/కూసుమంచి, వెలుగు : రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం పాలేరు, మధిర, ఖమ్మం, కోదాడ నియోజకవర్గాల్లో పర్యటించారు. పలు శుభకార్యాలకు హాజరైన మంత్రికి స్థానిక నాయకులు, ప్రజలు ఘనస్వాగతం పలికారు. బాధిత కుటుంబాలను ఆయన పరామర్శించారు. అనంతరం కాచిరాజుగూడెంలో పలువురు ఆయన సమక్షంలో కాంగ్రెస్​ పార్టీలో చేరారు.