తిమ్మాపూర్ మండలంలోని ఒక్క ఓటుతో గెలిచిన పొన్నాల సంపత్..

తిమ్మాపూర్ మండలంలోని ఒక్క ఓటుతో గెలిచిన పొన్నాల సంపత్..

తిమ్మాపూర్​, వెలుగు: తిమ్మాపూర్​ మండలంలోని మహాత్మానగర్​ గ్రామ పంచాయతీ పరిధిలో హోరాహోరీగా సాగిన పోలింగ్​లో స్వతంత్ర అభ్యర్థి ఒక్క ఓటుతో గెలుపొందారు. ఉల్లెంగుల ఏకానందంను బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ బలపరచగా.. పొన్నాల సంపత్‌‌‌‌‌‌‌‌ స్వతంత్ర అభ్యర్థి(బీఆర్ఎస్​ రెబల్​)గా బరిలో నిలిచారు. ఏకానందం 642ఓట్లు సాధించగా, సంపత్643ఓట్లు సాధించారు. ఒక్క ఓటు ఎక్కువగా రావడంతో ఎన్నికల అధికారులు సంపత్​ను విజేతగా ప్రకటించారు. ​