
శివపల్లి: ఉద్యోగుల పట్ట సీఎం కేసిీఆర్ చేసిన వ్యాఖ్యలు అర్థరహితమంటూ కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఉదయం పెద్దపల్లి జిల్లాలోని శివపల్లిలో కాంగ్రెస్ నేతలు పొన్నం ప్రభాకర్, రేవంత్ రెడ్డి పర్యటించారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ… సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు పొన్నం. ఆయన చెప్పిన కుక్క తోక సామెతలో కుక్కలని ఎవల్లనన్నరో చెప్పాలని అడిగారు. ఉద్యోగుల పట్ల కేసీఆర్ చేసిన అభ్యంతరకరమైన వాఖ్యలపై ఉద్యోగ సంఘాలు స్పందించాలని పొన్నం పిలుపునిచ్చారు.