
కరీంనగర్ కు మెడికల్ కాలేజ్ ఇస్తామన్న హామీపై జిల్లా మంత్రులు స్పందించాలన్నారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్. ప్రభుత్వ నుంచి రూపాయి నిధులు తీసుకురాకుండా మంత్రి గంగుల కమలాకర్ కాలక్షేపం చేస్తున్నారని ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పని చేస్తేనే అభివృద్ధి సాధ్యమన్నారు. కొత్త నాయకత్వాన్ని తయారు చేసుకునే సత్తా కాంగ్రెస్ పార్టీకి ఉందన్న పొన్నం…మున్సిపల్ ఎన్నికల్లో కొత్తవారికి అవకాశాలు ఇస్తామని చెప్పారు.