
మిడ్ మానేర్ ప్రాజెక్టు నిర్మాణంలో నాణ్యత లోపించిందన్నారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్. కట్ట లీకేజీ వార్తల నేపథ్యంలో మిడ్ మానేర్ ప్రాజెక్టును కాంగ్రెస్ నేతలు పరిశీలించారు. కట్ట నాణ్యతకు సంబంధించిన విషయాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు పొన్నం.మిడ్ మానేరు లీకేజీ కావడంతోనే 16 టీఎంసీల నీటిని అర్ధరాత్రి దిగువకు విడుదల చేశారన్నారు పొన్నం. ఎల్లంపల్లి నీటిని మిడ్ మానేరు కు ఎందుకు తరలించట్లేదన్నారు పొన్నం. 25 టీఎంసీల రిజర్వాయర్ ను ఖాళీగా ఉంచడంలో ఆంతర్యమేమిటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు పొన్నం. కట్ట నాణ్యతకు సంబంధించి ఢిల్లీ బృందం పరిశీలిస్తోందన్నారు జూనియర్ ఇంజనీర్ వేణుగోపాల్.