పసుపు బోర్డు, గిరిజన యూనివర్సిటీని ఇప్పుడు ప్రకటించడం హాస్యాస్పదం : పొన్నం ప్రభాకర్

పసుపు బోర్డు, గిరిజన యూనివర్సిటీని ఇప్పుడు ప్రకటించడం హాస్యాస్పదం : పొన్నం ప్రభాకర్

తెలంగాణలో  తొమ్మిది సంవత్సరాల్లో ఏర్పాటు చేయని పసుపు బోర్డు, గిరిజన యూనివర్సిటీని  ఇప్పుడు ప్రధాని మోదీ ప్రకటించడం హాస్యాస్పదమని కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. హుస్నాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.   పార్లమెంటులో తెలంగాణ రాష్ట్ర్ర  ఏర్పాటు విధానాన్ని అవమానపరిచే విధంగా ప్రధాని  మాట్లాడడం సభవం కాదన్నారు.  మోదీ అలా మాట్లాడుతుంటే ఇక్కడి బీజేపీ నాయకులకు  రోషం లేదా అని పొన్నం ప్రశ్నించారు. తెలంగాణ బిడ్డలే అయితే డీఎన్ ఏ పరీక్షలు చేసుకోవాలని చెప్పారు. 

కాంగ్రెస్ గ్యారంటీ కార్డు పథకాలను జీర్ణించుకోలేక మంత్రి  కేటీఆర్ లేని మాటలు మాట్లాడుతున్నాడని పొన్నం ప్రభాకర్ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ 2004 నుండి 2014 వరకు ఇచ్చిన హామీలను నెరవేర్చిందని  దీనిపై చర్చకు తాము  సిద్ధం మీరు సిద్ధమా అని కేటీఆర్ కు సవాల్ విసిరారు. తెలంగాణ అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ ను అడగడని,  అడిగిన కూడా ప్రధాని చేయరని పొన్నం ఆరోపించారు.