ఢిల్లీలో కేసీఆర్ పై థర్డ్ డిగ్రీ ప్రయోగించినట్లున్నరు

ఢిల్లీలో కేసీఆర్ పై థర్డ్ డిగ్రీ ప్రయోగించినట్లున్నరు

కేసీఆర్​ను పాగల్​ఖానాకు పంపించాలె
ఢిల్లీలో థర్డ్ డిగ్రీనో.. పవర్​ డిగ్రీనో ప్రయోగించినట్లున్నరు
పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్​ పొన్నం 

భీమదేవరపల్లి, వెలుగు: కేసీఆర్ ​నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నారని.. అర్జెంట్​గా అతన్ని పాగల్​ఖానాకు పంపించాలని పీసీసీ వర్కింగ్​ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రగతి భవన్ కలహాలో, ఇంట్లో వ్యవహారమో, బీజేపీ బ్లాక్ మెయిలింగో కానీ సీఎం చాలా డిప్రెషన్​కు గురవుతున్నట్లు కన్పిస్తున్నారన్నారు. ప్రజల భిక్షతో గద్దెనెక్కి ఆ పదవినే ఎడమ కాలి చెప్పుతో పోల్చడం అహంకారానికి నిదర్శనమన్నారు. గురువారం కొత్తకోండ వీరభధ్రస్వామి, ముత్తారంలోని త్రికూటాలయాలకు వెళ్లిన ఆయన అనంతరం చంద్రశేఖర్​గుప్తా మిల్లులో జరిగిన మీటింగ్​లో మాట్లాడారు. ఢిల్లీలో సీఎంపై థర్డ్​డిగ్రీ లేదా పవర్ డిగ్రీ ప్రయోగం జరిగిందేమోన్న అనుమానం వస్తుందన్నారు.

సీఎం ఎక్కడ ఉంటాడో తెలియక సెక్రటేరియట్, ఫాంహౌస్, ప్రగతిభవన్ చుట్టూ తిరిగిన ప్రజలు హాలియా సభకు వచ్చి తమగోడును చెప్పుకుందామని ట్రై చేస్తే కుక్కలతో పోల్చడం దారుణమన్నారు. మత్తు దిగే దాకా తరమడానికి మా కార్యకర్తలు రెడీగా ఉంటారని హెచ్చరించారు. వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్​చేశారు. ప్రతి పక్షాలను తొక్కిపారేస్తానని మాట్లాడుతున్న నాలుక తాటిమాట్ట కావచ్చని ఎద్దేవా చేశారు. ఉప ఎన్నిక వస్తేనే నియోజకవర్గ అభివృద్ధి గుర్తుకు వస్తుందా అని ప్రశ్నించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ ​నాయకులు శ్రీరాంచక్రవర్తి, అశోక్​ ముఖర్జీ, గోపీశర్మ, లింగమూర్తి, స్వరూప, చంద్రశేఖర్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.