- కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో తేలిన రిజర్వేషన్లు
- డివిజన్లు, వార్డుల వారీగా ఖరారైన రిజర్వేషన్లు
మంచిర్యాల, వెలుగు : మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠం బీసీ జనరల్‌కు దక్కింది. నిరుడు జనవరిలో మంచిర్యాల, నస్పూర్ మున్సిపాలిటీలతోపాటు హాజీపూర్ మండలంలోని ఐదు గ్రామ పంచాయతీలతో కార్పొరేషన్ ఏర్పాటైంది. ఇటీవల మున్సిపల్ ఎన్నికల సందడి ప్రారంభం కావడంతో తొలి మేయర్గా ఏ వర్గానికి చాన్స్ దక్కుతుందన్న చర్చ మొదలైంది. ఎట్టకేలకు మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేషన్ మేయర్ల రిజర్వేషన్లు ఖరారు కావడంతో ఉత్కంఠ వీడింది.
జిల్లాలోని బెల్లంపల్లి, క్యాతనపల్లి మున్సిపల్ చైర్పర్సన్లుగా జనరల్ మహిళలకు అవకాశం వచ్చింది. చెన్నూర్ మున్సిపల్ పీఠం బీసీ మహిళకు కేటాయించగా, లక్సెట్టిపేటలో ఎస్సీ జనరల్‌కు చాన్స్ దక్కింది. మంచిర్యాల కార్పొరేషన్‌తో పాటు నాలుగు మున్సిపాలిటీల్లో మహిళలకు మూడు సీట్లు రాగా, బీసీ, ఎస్సీలకు చెరొకటి దక్కాయి.
డివిజన్లు, వార్డుల్లోనూ..
కలెక్టర్ కుమార్ దీపక్ ఆధ్వర్యంలో శనివారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో డివిజన్లు, వార్డుల రిజర్వేషన్లు ఖరారు చేశారు. వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో డ్రా తీశారు. బీసీ డెడికేషన్ కమిషన్ రెకమండేషన్స్ ప్రకారం ఈ రిజర్వేషన్లు కేటాయించారు. ఎస్సీ, ఎస్టీ జనాభా ప్రాతిపదికన ముందుగా ఆయా వర్గాలకు రిజర్వేషన్లు ఫైనల్ చేశారు. 50 శాతం సీలింగ్ నిబంధనల మేరకు ఎస్సీ, ఎస్టీ వర్గాలకు రిజర్వేషన్లు కేటాయించగా, మిగిలిన వాటిని బీసీలకు రిజర్వు చేశారు. మొత్తం స్థానాల్లో మహిళలకు 50 శాతం కేటాయించారు. మంచిర్యాల కార్పొరేషన్ లో మొత్తం 60 డివిజన్లకు ఎస్టీ1, ఎస్సీ 9, బీసీ 20, జనరల్ 30 స్థానాలు దక్కాయి.
బెల్లంపల్లి మున్సిపాలిటీలో 34 వార్డులకు ఎస్టీ 1, ఎస్సీ 10, బీసీ 6, జనరల్ 17 సీట్లు కేటాయించారు. క్యాతనపల్లి మున్సిపాలిటీలో 22 వార్డులు ఉండగా, ఎస్టీ 1, ఎస్సీ 7, బీసీ 3, జనరల్ 11 స్థానాలు వచ్చాయి. చెన్నూర్ మున్సిపాలిటీలో మొత్తం 18 వార్డులకు ఎస్టీ 1, ఎస్సీ 3, బీసీ 5, జనరల్ 9 స్థానాలకు దక్కాయి. లక్సెట్టిపేట మున్సిపాలిటీలో మొత్తం 15 వార్డులు ఉండగా, ఎస్టీ 1, ఎస్సీ 3, బీసీ 3, జనరల్ 8 సీట్లు కేటాయించారు.
డివిజన్లు, వార్డుల వారిగా రిజర్వేషన్ల వివరాలు..
మంచిర్యాల కార్పొరేషన్ డివిజన్ నంబర్1,3,24,25,27,35,38,40,41,42,43,48,51,52,54,58 జనరల్ ఉమెన్ కు కేటాయించారు, 2,5,6,9 ఎస్సీ విమెన్ రిజర్వ్‌చేశారు, 4,8,11,13,30 ఎస్సీ జనరల్, 7,10,16,20,21,26,28,29,31,34,37,47,49,59 జనరల్, 12,14,15,17,23,32,33,44,56,57 బీసీ జనరల్, 18,22,36,39,45,46,50,53,55,60 బీసీ విమెన్, 19 ఎస్టీ జనరల్ కు కేటాయించారు.
బెల్లంపల్లి మున్సిపాలిటీ వార్డు నంబర్ 1,4,22,23,24 ఎస్సీ ఉమెన్స్‌కు కేటాయించారు. 2,9,14,26,27 ఎస్సీ జనరల్, 3,6,11,15,19,25,31,32,33 జనరల్ విమెన్, 5,7,8,20,21,28,29,34 జనరల్, 10,18,30 బీసీ విమెన్, 12 ఎస్టీ జనరల్, 13,16,17 బీసీ జనరల్ కు కేటాయించారు.
క్యాతనపల్లి మున్సిపాలిటీ వార్డు నంబర్ 1,9,10,11 జనరల్ కు కేటాయించారు. 2,5,12,13,15,18,19 జనరల్ ఉమెన్, 3,17,21 ఎస్సీ విమెన్, 4,6,14,16 ఎస్సీ జనరల్, 7,20 బీసీ జనరల్, 8 ఎస్టీ జనరల్, 22 బీసీ విమెన్ కు రిజర్వ్‌చేశారు.
ఉమ్మడి జిల్లాలోని మున్సిపాలిటీ రిజర్వేషన్లు వివరాలు..
మున్సిపాలిటీ చైర్మన్ వార్డులు ఎస్టీ ఎస్సీ బీసీ జనరల్ మహిళ ఆన్ రిజర్వ్
ఆదిలాబాద్ జనరల్ మహిళ 39 03 06 15 13 02
ఆసిఫాబాద్ బీసీ జనరల్ 20 02 03 05 06 04
కాగజ్ నగర్ బీసీ మహిళ 30 01 05 0 9 09 06
నిర్మల్ జనరల్ మహిళ 42 01 03 17 12 09
భైంసా జనరల్ 26 01 03 09 08 05
ఖానాపూర్ జనరల్ 12 01 02 03 04 02
