PS2: తమిళ ఆడియన్స్ కి యావరేజ్.. తెలుగు ఆడియన్స్ కి బోర్

PS2: తమిళ ఆడియన్స్ కి యావరేజ్.. తెలుగు ఆడియన్స్ కి బోర్

పొన్నియిన్ సెల్వన్2.. తమిళ దిగ్గజ దర్శకుడు మణిరత్నం డ్రీం ప్రాజెక్ట్. పాన్ ఇండియా లెవల్లో రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ మూవీ..  మొదటి భాగం గత సంవత్సరం విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఐదు వదల కోట్లకు పైగా వసూళ్ళని రాబట్టి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఇక దానికి కొనసాగింపుగా తెరకెక్కిన PS2 మూవీ ఇప్పుడు విడుదలకి సిద్ధంగా ఉంది.

ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 28న థియేటర్స్ లోకి రానుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీపై అంచనాలు కూడా అదే రేంజ్ లో ఉన్నాయి. దీంతో.. ఈ సినిమా మొదటిరోజు రికార్డ్ కలెక్షన్స్ రాబట్టడం ఖాయం అనేది తమిళ సినీ వర్గాల నుండి వినిపిస్తున్న మాట. ఇక తాజాగా సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఎలా ఉండబోతుంది అనే క్యూరియాసిటీ అందరిలోనూ నెలకొంది. అయితే.. సెన్సార్ సభ్యుల నుండి వినిపిస్తున్న సమాచారం మేరకు PS2 మూవీ తమిళ ప్రేక్షకులకు యావరేజ్ గానూ, మిగిలిన ఇండస్ట్రీ ఆడియన్స్ కి బోరింగ్ గా  ఉండనుందట.

అంతేకాదు.. PS2 తో పోలిస్తే PS1 కొంత బెటర్ అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఇక సినిమాపై కూడా ముందు నుండి సరైన బజ్ క్రియేట్ కాలేదనే  చెప్పాలి. ఐశ్వర్యారాయ్, చియాన్ విక్రమ్, కార్తీ, త్రిష వంటి  చాలామంది స్టార్స్ ఈ సినిమాలో పనిచేసినప్పటికీ ఆ రేంజ్ లో హైప్ క్రియేట్ కాలేదు. బయ్యర్స్ కూడా ఈ సినిమాని తీసుకోవడానికి వెనుకాడారట. మరి ఇన్ని అవాంతరాల మధ్య విడుదలవుతున్న ఈ మూవీ.. బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి మరి.