బాలీవుడ్‌‌లోనూ సత్తా చాటుతోన్న పూజాహెగ్డే

బాలీవుడ్‌‌లోనూ సత్తా చాటుతోన్న పూజాహెగ్డే

తెలుగు, తమిళ భాషల్లో స్టార్‌‌‌‌ హీరోయిన్‌‌గా కొనసాగుతున్న పూజాహెగ్డే, మరోవైపు బాలీవుడ్‌‌లోనూ సత్తా చాటుతోంది. ప్రస్తుతం ఆమె మహేష్‌‌ బాబుకి జంటగా నటిస్తోంది. త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్‌‌లో జరుగుతోంది. అయితే పూజాహెగ్డే మాత్రం షూటింగ్‌‌కు బ్రేక్ ఇచ్చి పెళ్లి పనుల్లో బిజీగా గడిపింది. ఇటీవల తన అన్నయ్య రిషబ్ హెగ్డే పెళ్లి జరిగింది. మ్యారేజ్‌‌ ఈవెంట్‌‌లో చీరకట్టుతో ఇంప్రెస్ చేసిన పూజాహెగ్డే.. సంగీత్‌‌ ఫంక్షన్‌‌లో లెహెంగాలో మెరిసింది. ఇందుకు సంబంధించిన ఫొటోస్‌‌తో పాటు.. ఈ ఫంక్షన్‌‌లో ఆమె చేసిన డ్యాన్స్‌‌కు అభిమానులు ఫిదా అవుతున్నారు.

మొత్తానికిలా ఫ్యామిలీ ఈవెంట్‌‌లో ఫుల్ ఎంజాయ్ చేసింది పూజ. ఇక లాస్ట్ ఇయర్ రాధేశ్యామ్, ఆచార్య, బీస్ట్, సర్కస్ చిత్రాలు ఆమెను నిరాశ పరిచాయి. దీంతో సల్మాన్‌‌ ఖాన్‌ సినిమా ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’తో తిరిగి సక్సెస్‌‌ ట్రాక్‌‌ ఎక్కాలని ఆశపడుతోంది. ఏప్రిల్‌‌ 21న ఈ చిత్రం విడుదల కానుంది. ఆల్రెడీ తమిళంలో హిట్ అయిన ‘వీరమ్‌‌’కి రీమేక్‌‌ కావడం, సల్మాన్‌‌కి సెంటిమెంట్ అయిన ఈద్‌‌ సీజన్‌‌లో వస్తుండడంతో అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. మరి పూజ ఆశలు ఎంతవరకూ ఫలిస్తాయో చూడాలి!