
స్టార్ హీరోయిన్ పూజ హగ్దే సిచువేషన్ మరీ దారుణంగా తయారయ్యింది. కొత్త ఆఫర్స్ రావడం పక్కన పెడితే.. ఉన్న సినిమాల నుండి కూడా ఆమెను తీసేస్తున్నారు. దీంతో ఈ అమ్మడు తన రెమ్యునరేషన్ ను భారీగా తగ్గించేసింది. నిజానికి పూజ హిట్ కొట్టి చాలా కాలమే అయ్యింది. రీసెంట్ గా ఆమె నటించిన సినిమాలన్నీ భారీ పరాజయాలే. అందులో.. ఆచార్య, రాధే శ్యామ్,కిసీకి భాయ్ కిసీకి జాన్ వంటి భారీ డైజెస్టర్స్ ఉన్నాయి.
దీంతో ప్రస్తుతం ఆమె ఒప్పుకున్న సినిమాలన్నింటినీ నుండి ఆమెను తీసేస్తున్నారు మేకర్స్. దీనికి కారణం.. పూజ రెమ్యునరేషన్ భారీగా డిమాండ్ చేస్తుండటమే. ఈ కారణంగానే ఆమెను రెండు భారీ ప్రాజెక్టు ల నుండి తీసేశారని వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. అందులో ఒకటి మహేష్-త్రివిక్రం కాంబోలో వస్తున్న మోస్ట్ హైపుడ్ ప్రాజెక్టు గుంటూరు కారం. ఈ సినిమా కోసం పూజ ఏకంగా రూ.4 కోట్లు డిమాండ్ చేసిందట. మార్కెట్ లేకపోయినా.. ఈ రేంజ్ లో డిమాండ్ చేస్తుండటంతో మేకర్స్ ఆమె స్థానంలో మలయాళ బ్యూటీ సంయుక్త మీనన్ ను అప్ప్రోచ్ అయ్యారట. ఇక ఇప్పటికే ఈ సినిమా శ్రీలీలను మరో హీరోయిన్ గా కన్ఫర్మ్ చేశారు మాకర్స్.
ఇక మరో సినిమా పవన్-హరీష్ కాంబోలో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్. ఈ సినిమాపై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. అందుకే దానికి తగ్గట్టుగానే స్టార్ క్యాస్ట్ ను తీసుకున్నారు మేకర్స్. ఈ సినిమా కోసం కూడా పూజ భారీగానే డిమాండ్ చేసిందట.దీంతో ఈ సినిమా నుండి కూడా పూజను తొలగించాలని చుస్తున్నారట మేకర్స్. ఆమె స్థానంలో మరో హీరోయిన్ ను సెట్ చేసే పనిలో ఉన్నారని సమాచారం. ఈ సినిమాలో కూడా మరో హీరోయిన్ గా శ్రీలీల ఇప్పటికే కన్ఫర్మ్ అయ్యింది. ఈమెకు సంబందించిన ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు.
ఇక వరుసగా సినిమా ఆఫర్స్ అన్నీ చేజారుతుండటంతో చేసేదేమి లేక తన రెమ్యునరేషన్ ను భారీగా తగ్గించిందట పూజ. మొన్నటివరకు రూ. 3 నుండి 4 కోట్ల వరకు తీసుకున్న ఈ బ్యూటీ.. ప్రస్తతం రూ.75 లక్షల తీసుకుంటోందట. మరి రెమ్యునరేషన్ తగ్గించాక ఐనా పూజకు మల్లి ఆఫర్స్ వస్తాయా అనేది చూడాలి.