
టాలీవుడ్ ప్రముఖ నటి పూనమ్ కౌర్( Poonam Kaur ) సోషల్ మీడియాలో ఏ ట్వీట్ చేసినా హాట్ టాపిక్ క్షణాల్లో వైరల్ అవుతోంది. లేటెస్ట్ గా పూనమ్ కౌర్ చేసిన ట్వీట్ మరోసారి చర్చనీయాంశమైంది. ఈ మధ్య పాలిటిక్స్ కామెడీగా మారాయి.. కామెడీ మాత్రం సీరియస్ గా మారిపోయింది..అంటూ పూనమ్ ట్వీట్ చేశారు.
రీసెంట్ గా రిలీజ్ అయినా పవన్ కళ్యాణ్(Pawan Kalyan) బ్రో మూవీలో కమెడియన్ పృథ్వీ రాజ్ మినిస్టర్ అంబటి రాంబాబును శ్యామ్ బాబు గా ఇమిటేట్ చేశారంటూ పెద్ద రచ్చ జరుగుతున్న విషయం తెలిసేందే. దీంతో పూనమ్ ట్వీట్ బ్రో మూవీను ఉద్దేశించే ట్వీట్ చేశారంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
కొన్నిరోజుల క్రితం వైఎస్సార్ తో కలిసి దిగిన ఫోటోను షేర్ చేయడం ద్వారా పూనమ్ కౌర్ వార్తల్లో నిలిచారు.మరోసారి పూనమ్ కౌర్ ఏపీ రాజకీయాల్లో( AP Politics ) హాట్ టాపిక్ అవుతుండటం గమనార్హం.