యూ ట్యూబ్ లింక్స్ డిలీట్ చేయండి : పూనమ్ కౌర్

యూ ట్యూబ్ లింక్స్ డిలీట్ చేయండి : పూనమ్ కౌర్

తన పేరుతో యూట్యూబ్ లో పెడుతున్న వీడియోలను తొలగించాలంటూ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు సినీ నటి పూనమ్ కౌర్. కొన్నేళ్లుగా తాను వేదన అనుభవిస్తున్నానీ… తన గౌరవానికి ఆ వీడియోలు ఇబ్బంది కలిగిస్తున్నాయని.. ఆ వీడియోలు తీసేసి… వాటిని పోస్ట్ చేస్తున్నవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆమె పోలీసులను కోరారు.

“నాపై యూట్యూబ్ లో అసత్య ప్రచారం చేస్తున్నారు. ఉద్దేశపూర్వకంగానే నన్ను ఇబ్బందిపెట్టేలా అసభ్యకరమైన పోస్టింగ్స్ చేస్తున్నారు. కొంతమంది వ్యక్తులు తనను కించ పరిచే విధంగా పోస్టింగులు పెడుతున్నారు. నాకు డౌట్ ఎవరిపైన ఉందో అది పోలీసులకు చెప్పాను. దాదాపు 50 టూట్యూబ్ ఛానెల్స్ పై ఫిర్యాదు చేశాను. ఎవరు ఈ వీడియోలు పెడుతున్నారో పోలీసులు తేలుస్తారు. ఇలాంటి ఏ అమ్మాయి కూడా ఇబ్బంది పడకూడదు. పోలీసులు దీనిపై యాక్షన్ తీసుకోవాలని కోరాను” అని పూనమ్ కౌర్ చెప్పారు.