- ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి
గద్వాల, వెలుగు: కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని ప్రజా ప్రభుత్వంతోనే పేద ప్రజలకు న్యాయం జరుగుతుందని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. ఆదివారం గద్వాల నియోజకవర్గంలోని మల్దకలు, గట్టు మండ పలు గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్లను ఆయన ప్రారంభించారు. పేద ప్రజలు ఎన్నో ఏండ్లుగా ఎదురుచూస్తున్న సొంతింటి కలలు ప్రజా పాలన సీఎం నాయకత్వంలో నెరవేరిందన్నారు. అంతకుముందు ఇండ్ల జాబితా ఇండ్ల గణన జనాభా లెక్కల ఆన్ లైన్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు.

