టీఎఫ్జేఏ వెబ్సైట్ని ఆవిష్కరించిన పవన్ కల్యాణ్

టీఎఫ్జేఏ వెబ్సైట్ని ఆవిష్కరించిన పవన్ కల్యాణ్

తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ (టీఎఫ్జేఏ) సేవలు అమోఘమని ప్రముఖ నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. ఆదివారం టీఎఫ్జేఏ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో అసోషియేషన్ వెబ్ సైట్, యూ ట్యూబ్ ఛానల్ ను పవన్ కల్యాణ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ వెబ్ సైట్, యూట్యూబ్ ఛానల్ ను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. ఫిలిం జర్నలిస్టు కుటుంబ సభ్యులకు రూ.3 లక్షల మెడికల్ ఇన్సూరెన్స్ , జీవిత బీమా కింద రూ 15 లక్షలు, యాక్సిడెంట్ పాలసీ కింద రూ. 25 లక్షలు ఇవ్వడం గొప్ప విషయమన్నారు. సమాజాన్ని మార్చడంలో జర్నలిస్టులు తమ వంతు పాత్ర నిర్వహించాలని, అంతే గానీ అనవసర వార్తలు రాసి ప్రజలకు నష్టం కలిగించొద్దని సూచించారు.

టీఎఫ్జేఏ ప్రెసిడెంట్ లక్ష్మీ నారాయణ, జనరల్ సెక్రెటరీ వైజే రాంబాబు, ట్రెజరర్  నాయుడు  సురేంద్ర కుమార్ మాట్లాడుతూ.. సంస్థలో మొత్తం 175 మంది సభ్యులున్నారని, వారికి ఏ ఆపద వచ్చినా సంస్థ అన్ని విధాల ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు.