Rukmini Vasanth: టాక్సిక్ మూవీ నుంచి రుక్మిణి వసంత్ ఫస్ట్ లుక్ రిలీజ్.. 

Rukmini Vasanth: టాక్సిక్ మూవీ నుంచి రుక్మిణి వసంత్ ఫస్ట్ లుక్ రిలీజ్.. 

సప్త సాగరాలు దాటి,  కాంతార ఛాప్టర్ 1 లాంటి కన్నడ చిత్రాలతో ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ వర్గాల దృష్టిని ఆకట్టుకున్న రుక్మిణి వసంత్.. ప్రస్తుతం వరుస క్రేజీ ప్రాజెక్ట్స్‌‌‌‌తో దూసుకెళుతోంది.

ఎన్టీఆర్‌‌‌‌‌‌‌‌ హీరోగా ప్రశాంత్ నీల్ తీస్తున్న ‘డ్రాగన్‌‌‌‌’లో హీరోయిన్‌‌‌‌గా నటిస్తోన్న ఆమె.. మరోవైపు యశ్ సినిమా ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్-అప్స్’లో కీలకపాత్ర పోషిస్తోంది. మంగళవారం ఈ చిత్రం నుంచి తన ఫస్ట్ లుక్ పోస్టర్‌‌‌‌‌‌‌‌ను విడుదల చేశారు.  ఇప్పటివరకూ ఎక్కువగా ట్రెడిషనల్‌‌‌‌ క్యారెక్టర్స్‌‌‌‌లోనే ఎక్కువగా కనిపించిన ఆమె.. ఈసారి మోడ్రన్‌‌‌‌ కాస్ట్యూమ్స్‌‌‌‌లో కనిపించి సర్‌‌‌‌‌‌‌‌ప్రైజ్‌‌‌‌ చేసింది. 

మెల్లిసా అనే పాత్రలో అందం, అధికారం, ఆత్మవిశ్వాసం కలబోసిన యువతిగా ఇందులో ఆమె కనిపించబోతోందని ఫస్ట్ లుక్ ద్వారా అర్థమవుతోంది. ఇంటర్నేషనల్‌‌‌‌ స్టాండర్డ్స్‌‌‌‌లో గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్‌‌‌‌ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనర్‌‌‌‌‌‌‌‌లో నయనతార, కియారా అద్వానీ, హూమా ఖురేషి ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. కేవీఎన్‌‌‌‌ ప్రొడక్షన్స్‌‌‌‌తో కలిసి యశ్ నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి 19న  ప్రేక్షకుల ముందుకురానుంది.