పాపులర్ యూట్యూబర్ హత్య.. జపాన్ లో ఏం జరుగుతుంది

పాపులర్ యూట్యూబర్ హత్య.. జపాన్ లో ఏం జరుగుతుంది

27 ఏళ్ల జపనీస్ మోడల్, LGBTQ ఇన్‌ఫ్లుయెన్సర్, బుల్లితెర నటి ర్యూచెల్ కన్నుమూశారు. ప్రభావతి టోక్యోలోని ఏజెన్సీ కార్యాలయంలో చనిపోయినట్టు ర్యూచెల్ మేనేజర్ తెలిపారు.

ర్యూచెల్ మరణానికి మాత్రం ఇప్పటివరకు ఖచ్చితమైన కారణం తెలియలేదు. ప్రస్తుతం పోలీసులు ఆత్మహత్యకు గల కారణాలపై విచారిస్తున్నారు. టోక్యోలోని మెట్రోపాలిటన్ పోలీస్ డిపార్ట్‌మెంట్ స్థానిక వార్తాపత్రిక నివేదించినట్లుగా, ఈ విషాద సంఘటన వెనక దాగిన పరిస్థితులను పరిశీలిస్తోంది.

ర్యూచెల్ ఎవరు?

ర్యూచెల్ 1995లో ఒకినావా ప్రిఫెక్చర్‌లోని గినోవాన్‌లో జన్మించింది. ఉన్నత పాఠశాల నుంచి పట్టా పొందిన తర్వాత టోక్యోలోని హరాజుకులో ఓ బట్టల దుకాణంలో పనిచేశారు. ఆ తర్వాత ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ గా పేరు తెచ్చుకున్న ర్యూచెల్ అసలు పేరు ర్యూజీ హిగా. లింగ రహిత డ్రెస్సింగ్‌కు ఎంతో ప్రసిద్ధి చెందింది కూడా.

ర్యూచెల్ జపాన్‌లో LGBTQ (lesbian, gay, bisexual, transgender, queer or questioning persons or the community) సమస్యలకు న్యాయవాదిగా ఉండేది. తరచూ బహిరంగంగా ఈ అంశంపై మాట్లాడేవారు. జపాన్ టైమ్స్ ప్రకారం టోక్యో రెయిన్‌బో ప్రైడ్‌లో ర్యూచెల్ చురుకుగా పాల్గొనేవారు. అంతే కాదు ర్యూచెల్ పలు టీవీ షోలలో, జపాన్‌లోని అనేక క్వీర్ ఈవెంట్‌లలో కూడా కనిపించారు.

2016 లో ర్యూచెల్ తోటి మోడల్ పెకోను వివాహం చేసుకున్నారు. ఈ జంటకు ఒక కుమారుడు జన్మించాడు. అయితే, 2022 లో, ఈ జంట విడాకులు తీసుకుంటామని సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. బిడ్డను మాత్రం కలిసి పెంచుకునేందుకు ఇద్దరూ అంగీకరించారు. విడాకుల తర్వాత ర్యూచెల్ ఆన్‌లైన్‌లో అనేక విమర్శలను ఎదుర్కొన్నారు.