
ప్రముఖ పంజాబీ సింగర్ శార్దూల్ సికిందర్ కన్నుమూశారు. గత కొంత కాలంగా కరోనా సోకి ఆనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇవాళ(బుధవారం) మొహాలీలోని ఓ ఆస్పత్రిలో ట్రీట్ మెంట్ తీసుకుంటూ తుదిశ్వాస విడిచారు. ఆయన వయస్సు 60 ఏళ్లు. శార్దూల్ సికిందర్ పంజాబీ ఫోక్, పాప్ సింగర్. 1980లో ఆయన రోడ్‌వేస్ ది లారీ పేరిట మొదటి ఆల్బమ్‌ను విడుదల చేశారు.ఈ ఆల్బమ్ తో శార్దూల్‌కు మంచి పాపులారిటీ వచ్చింది.