ముగిసిన విజయదేవర కొండ ఈడీ విచారణ

ముగిసిన విజయదేవర కొండ ఈడీ విచారణ

నటుడు విజయ్ దేవరకొండ ఈడీ విచారణ ముగిసింది. విచారణ అనంతరం మాట్లాడిన విజయ్ దేవర కొండ ఈడీ కార్యాలయానికి ఉదయమే వచ్చానని చెప్పారు. ఈడీ వాళ్లకు కొన్ని క్లారిఫికేషన్ కావాల్సి ఉండేనన్న విజయ్.. వాళ్లు  అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పానని చెప్పారు. మీరు ఇంత ప్రేమిస్తారు... ఆ ప్రేమతో వచ్చే పాపులారిటీ వల్ల కొన్ని ఇబ్బందులు, కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని అన్నారు. ఇది కూడా తనకు ఓ రకమైన అనుభవమేనని తెలిపారు. అయితే ఏ కేసుపై విచారించారన్న ప్రశ్నకు మాత్రం విజయ్ దేవరకొండ సమాధానం ఇవ్వలేదు.

లైగర్ మూవీ ఆర్థిక వ్యవహారాలపై ఈడీ అధికారులు హారో విజయ్ దేవరకొండ ఈ రోజు హాజరు కావాలని నోటీసులిచ్చారు. అయితే ఇప్పటికే డైరెక్టర్ పూరీ జగన్నాథ్, ఛార్మిలను ఈడీ విచారించింది. ప్రధానంగా సినిమా షూటింగ్‌‌ కోసం ఇద్దరి అకౌంట్స్‌‌లో డిపాజిట్‌‌ అయిన డబ్బుకు సంబంధించిన వివరాలతో స్టేట్‌‌మెంట్‌‌ రికార్డ్‌‌ చేసినట్లు తెలుస్తోంది. సినిమా షూటింగ్‌‌ కోసం ఫారిన్‌‌లో ఇన్వెస్ట్ చేసిన డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, పెట్టుబడులు ఎవరు పెట్టారనే వివరాలు సేకరించింది. విదేశాల్లో జరిగిన షూటింగ్ సెట్టింగ్స్, అక్కడి నటులకు చెల్లించిన రెమ్యునరేషన్‌‌కు సంబంధించిన డాక్యుమెంట్స్‌‌ను పరిశీలించినట్లు సమాచారం. మూవీ కోసం తీసుకున్న బ్యాంక్ లోన్స్, ఇతర ప్రైవేట్‌‌  సంస్థల నుంచి తీసుకున్న రుణాలు, విదేశాలకు డబ్బును ఏ రూపంలో తరలించారనే కోణంలో ప్రశ్నించినట్లు తెలుస్తోంది.