నకిలీ సర్టిఫికెట్లు గుర్తించేలా  పోర్టల్

నకిలీ సర్టిఫికెట్లు గుర్తించేలా  పోర్టల్

రాష్ట్రంలో నకిలీ సర్టిఫికెట్లు లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు డీజీపీ మహేందర్ రెడ్డి. ఉన్నత విద్యామండలి, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో.. నకిలీ సర్టిఫికెట్లు గుర్తించేలా  పోర్టల్ రూపొందించామన్నారు. యూనివర్సిటీల వీసీలతో.. డీజీపీ మహేందర్ రెడ్డి, ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబాద్రి సమావేశమయ్యారు.  ఫేక్ సర్టిఫికెట్లు తయారు చేసేవారిని వదిలిపెట్టేదిలేదన్నారు. 2010 నుంచి ఇప్పటివరకు అన్ని వర్సిటీల సర్టిఫికెట్లు పోర్టల్ లో అందుబాటులో ఉంచుతామన్నారు. ఉద్యోగాలు పొందే సమయంలో... ఈ పోర్టల్ ద్వారా సర్టిఫికెట్ నకిలీదా ఒరిజినల్ దా అని తెలుసుకోవచ్చని తెలిపారు.