ఆఫీస్‌ టైమ్‌ ముగిశాక కంపెనీవాళ్లు స్టాఫ్‌తో కాంటాక్ట్‌ కాకూడదు!

ఆఫీస్‌ టైమ్‌ ముగిశాక కంపెనీవాళ్లు స్టాఫ్‌తో కాంటాక్ట్‌ కాకూడదు!

న్యూఢిల్లీ: ఆఫీస్ టైమ్ కాకపోయినా మీ బాస్‌‌  ఊరికే కాల్ చేస్తున్నారా? కలవాలని ప్రయత్నిస్తున్నారా?  ఇలా చేస్తే ఆ బాస్‌‌కు ఈ దేశంలో ఫైన్ పడుతుంది. పోర్చుగల్‌‌ పార్లమెంట్‌‌ తాజాగా కొన్ని లేబర్ చట్టాలను ప్రవేశపెట్టింది. ఆఫీస్‌‌ అవర్స్‌‌కు  వెలుపల కంపెనీలు తమ ఉద్యోగులను కాంటాక్ట్ అయితే, ఆ కంపెనీలపై ఫైన్ వేయొచ్చని ఈ చట్టం చెబుతోంది. కరోనా వలన వర్క్ ఫ్రమ్‌‌ హోం విధానం పెరిగిన విషయం తెలిసిందే. ఈ విధానం వలన బెనిఫిట్స్ ఉన్నాయని ఈ దేశ ప్రభుత్వం అంగీకరించింది. కానీ, లేబర్ చట్టాలను ఈ విధానాలకు కూడా అప్లయ్ చేయాలనుకుంటున్నామని పేర్కొంది. స్టాఫ్‌‌ లేదా వారి ఫ్యామిలీల ప్రైవసీకి భంగం కలగకుండా ఉండేందుకు ఈ చట్టాలను తీసుకొస్తున్నామని పోర్చుగల్ ప్రభుత్వం పేర్కొంది. ఇండ్లలో ఆఫీస్‌‌ రిలేటెడ్‌‌ వర్క్ చేస్తే,  ఆ ఖర్చులను కూడా కంపెనీలే భరించాల్సి ఉంటుందని తెలిపింది. అంటే ఎలక్ట్రిసిటీ బిల్లులు వంటి ఖర్చులు.  ‘ అసాధారణ పరిస్థితుల్లో తప్ప ఆఫీస్‌‌ అవర్స్‌‌కు వెలుపల స్టాఫ్‌‌ను కంపెనీలు కాంటాక్ట్ అవ్వకపోవడం మంచిది’ అని ఈ కొత్త చట్టం చెబుతోంది. కానీ, వర్క్ ఆఫ్ రోజు పూర్తిగా ప్రొఫెషనల్ కమ్యూనికేషన్‌‌ను ఉద్యోగులు కట్ చేసే రూల్‌‌కు మాత్రం ఈ దేశ పార్లమెంట్ అంగీకరించలేదు. పోర్చుగల్‌‌లో ఎలక్షన్స్‌‌ ఉండడంతో వర్కర్స్‌‌ను ఆకర్షించడానికి అక్కడి ప్రభుత్వం ఈ చట్టాలను తీసుకొచ్చింది.