అన్ లాక్ చేయాలంటే ఈ పాయింట్లను ఫాలో కావాలె

అన్ లాక్ చేయాలంటే ఈ పాయింట్లను ఫాలో కావాలె

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటంతో కొన్ని రాష్ట్రాలు అన్ లాక్ దిశగా నడుస్తున్నాయి. క్రమక్రమంగా లాక్ డౌన్ ఆంక్షలను ఎత్తేయాలని భావిస్తున్నాయి. అయితే మూడు నిబంధనలను పాటిస్తూ అన్ లాక్ చేయాలని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ అంటున్నారు.

'సగటున ఒకవారంలో కరోనా కేసుల నమోదు 5 శాతం లోపే ఉండటం. అధిక వయస్సు లేదా కరోనాతో ఎక్కువ హానిని ఎదుర్కొనే జనాభాలో 70 శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తి చేయాలి. ఒకవేళ వారికి టీకా ఇవ్వకుంటే ఆ పనిని కంప్లీట్ చేయాలి. ఆ తర్వాతే అన్ లాక్ ప్రక్రియను మొదలుపెట్టాలి' అని బలరాం భార్గవ సూచించారు.