చిన్నారితో స్కూల్ బస్సు డ్రైవర్ అసభ్య ప్రవర్తన

చిన్నారితో స్కూల్ బస్సు డ్రైవర్ అసభ్య ప్రవర్తన
  • చితకబాదిన కుటుంబసభ్యులు
  • నిందితుడి పై పోక్సో కేసు

జీడిమెట్ల, వెలుగు: ఓ స్కూల్ బస్సు డ్రైవర్ నాలుగేళ్ల పాపతో అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటన పేట్​బషీరాబాద్​ పోలీస్ స్టేషన్​పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దూలపల్లిలోని విజ్జ్వల హైస్కూల్లో ఓ చిన్నారి(4) యూకేజీ చదువుతోంది. ఈ నెల 4న స్కూల్​బస్సు డ్రైవర్​శ్రీనివాస్​పాపను ఇంటి నుంచి పాఠశాలకు తీసుకువచ్చాడు. మధ్యాహ్నం ఆ చిన్నారితో అసభ్యంగా ప్రవర్తించి, భయపెట్టాడు. 

తర్వాత ఇంటికి వెళ్లిన పాప తిరిగి  స్కూల్​కు వెళ్లడానికి ఇష్టపడలేదు. తల్లిదండ్రులు ఏమైందని అడగడంతో అసలు విషయం బయటపడింది. దీంతో చిన్నారి తల్లిదండ్రులు తమ బంధువులతో కలిసి సోమవారం స్కూల్​కు వెళ్లి ప్రిన్సిపాల్​ను నిలదీశారు. డ్రైవర్ ను పిలిపించడంతో అతన్ని చితకబాదారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వచ్చి, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పోక్సో కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.