కౌన్సిల్ సెక్రటరీ పోస్టును..డిగ్రీ ప్రిన్సిపల్​తో భర్తీ చేయాలి

కౌన్సిల్ సెక్రటరీ పోస్టును..డిగ్రీ ప్రిన్సిపల్​తో భర్తీ చేయాలి
  • ఎమ్మెల్సీ కోదండరాం​కు టీజీసీటీఏ వినతి

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ స్టేట్ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ సెక్రటరీ పోస్టును సర్కారు డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్​తోనే భర్తీ చేయాలని తెలంగాణ గవర్నమెంట్ కాలేజీ టీచర్స్ అసోసియేషన్ (టీజీసీటీఏ) ప్రభుత్వాన్ని కోరింది. సోమవారం అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సంగి రమేశ్​, డాక్టర్ బ్రిజేష్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం  ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాంను కలిసి వినతిపత్రం అందించారు.

కౌన్సిల్ చైర్మన్, వైస్ చైర్మన్ పోస్టులను సీనియర్ ప్రొఫెసర్లతో భర్తీ చేస్తున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో ఇటీవలే ఖాళీ అయిన కౌన్సిల్ సెక్రటరీ పోస్టును డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్​ తో నింపాలని కోరారు. ప్రభుత్వంతో మాట్లాడి, సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని వారికి ఆయన హామీనిచ్చారు.