
- రిస్క్ లేని ఇన్వెస్ట్‌మెంట్!
బిజినెస్ డెస్క్, వెలుగు: రిస్క్ లేని ఇన్వెస్ట్‌మెంట్ గురించి వెతుకుతుంటే మాత్రం ఇండియా పోస్ట్ ఆఫర్ చేస్తున్న మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ (ఎంఐఎస్) గురించి తెలుసుకోవాల్సిందే. ట్యాక్స్ ఫ్రీ కావడంతో పాటు ఇన్వెస్ట్‌మెంట్ అమౌంట్‌పై వడ్డీని నెల నెలా తీసుకునే వెసులు బాటు ఉంటుంది. ప్రభుత్వ సపోర్ట్ ఉండడంతో మన ఇన్వెస్ట్‌మెంట్‌కు ఎటువంటి రిస్క్ ఉండదని చెప్పొచ్చు. రిస్క్ వద్దనుకునే వారికి ఈ స్కీమ్ బాగా సరిపోతుంది. చాలా బ్యాంకుల్లో ఇచ్చే వడ్డీ కన్నా ఇండియా పోస్ట్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్‌లో ఎక్కువ వడ్డీని ప్రభుత్వం ఇస్తోంది. ప్రతీ ఏడాది వడ్డీ ఎంత ఇవ్వాలనేది గవర్నమెంట్ నిర్ణయిస్తుంది. కిందటేడాది 6.6 శాతం వడ్డీని ఇవ్వాలని నిర్ణయించారు.
రూ. 1000 నుంచే..
దగ్గరలోని పోస్టు ఆఫీస్‌కు వెళ్లీ ఈ స్కీమ్ కింద అకౌంట్‌ను ఓపెన్ చేసుకోవచ్చు. కనీసం రూ. 1,000 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత డిపాజిట్ చేసే అమౌంట్ కూడా రూ. 1,000 కి మల్టిపుల్‌గా ఉండాలి. ఒక అకౌంట్ కింద గరిష్టంగా రూ. 4.5 లక్షలు మాత్రమే ఇన్వెస్ట్ చేయడానికి వీలుంటుంది. అదే జాయింట్ అకౌంట్ అయితే రూ. 9 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. కానీ, ఇండివిడ్యువల్స్ గరిష్టంగా (జాయింట్ అకౌంట్ కింద చేసిన ఇన్వెస్ట్‌మెంట్స్ కూడా కలిపి) రూ. 4.5 లక్షలు మాత్రమే ఇన్వెస్ట్ చేయాలి. జాయింట్ అకౌంట్‌లో ఇండివిడ్యువల్స్‌కు సమాన వాటా ఉంటుంది. కిందటేడాది ప్రభుత్వం 6.6 శాతం వడ్డీని ఈ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ కింద ఇచ్చింది. దీని బట్టి ఎవరైనా రూ. 4.5 లక్షల ఇన్వెస్ట్ చేస్తే వారికి నెలకు (డిపాజిట్ చేసిన డేట్ నుంచి నెలకు) రూ. 2,400 వడ్డీ కింద వస్తుంది. ఈ వడ్డీ అమౌంట్‌ను అదే పోస్టు ఆఫీస్‌లోని సేవింగ్స్‌కు అకౌంట్‌కు పంపుకొని (ఆటోమెటిక్ క్రెడిట్) విత్‌డ్రా చేసుకోవచ్చు. కేవలం ఇండియా న్ సిటిజన్స్‌కు మాత్రమే ఈ స్కీమ్ కింద అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి వీలుంటుంది. 18 ఏళ్లు దాటినవారు అవసరమైన డాక్యుమెంట్లను సబ్మిట్ చేసి ఈ అకౌంట్‌ను ఓపెన్ చేసుకోవచ్చు. 10 ఏళ్లకు పైనున్న మైనర్లు కూడా ఈ అకౌంట్‌ను ఓపెన్ చేసుకోవచ్చు. కానీ, వీరు 18 ఏళ్లు దాటిన తర్వాతనే ఈ స్కీమ్ బెనిఫిట్స్ పొందగలుగుతారు.