బస్సు ఎక్కినంక కాదు.. దిగినంక టికెట్

బస్సు ఎక్కినంక కాదు.. దిగినంక టికెట్
  • కొత్త విధానం తీసుకొస్తున్న స్విట్జర్లాండ్‌‌‌‌‌‌‌‌

మనం బస్సెక్కగానే కండక్టరొచ్చి ‘టికెట్‌‌‌‌‌‌‌‌.. టికెట్‌‌‌‌‌‌‌‌’ అంటాడు. పైసలు తీస్కొని మనం అడిగిన ప్లేస్‌‌‌‌‌‌‌‌కు టికెట్‌‌‌‌‌‌‌‌ ఇస్తడు. ఏ ప్రాంతంలోనైనా, ఏ దేశంలోనైనా ఇట్లే ఉంటది. కానీ స్విట్జర్లాండ్‌‌‌‌‌‌‌‌ ‘మేం డిఫరెంట్‌‌‌‌‌‌‌‌’ అంటోంది. బస్సెక్కినంక కాదు. దిగినంక టికెట్‌‌‌‌‌‌‌‌ ఇస్తమని చెబుతోంది. పోయిన ఏడాదే ఈ ‘పోస్ట్‌‌‌‌‌‌‌‌ ప్రైస్‌‌‌‌‌‌‌‌ టికెటింగ్‌‌‌‌‌‌‌‌ సిస్టమ్‌‌‌‌‌‌‌‌’ను అక్కడి బస్సులు, ట్రామ్‌‌‌‌‌‌‌‌, మెట్రోల్లో ట్రయల్‌‌‌‌‌‌‌‌గా స్టార్ట్‌‌‌‌‌‌‌‌ చేసింది. సుమారు 90 వేల మంది ప్రజలు ఈ సర్వీసులను వాడుకుంటున్నారు. 2020లో పూర్తి స్థాయిలో స్టార్ట్‌‌‌‌‌‌‌‌ చేస్తామని స్విట్జర్లాండ్‌‌‌‌‌‌‌‌ వెల్లడించింది. కొత్త సిస్టమ్‌‌‌‌‌‌‌‌ ప్రకారం ప్రయాణికుడు బస్సెక్కగానే తన మొబైల్‌‌‌‌‌‌‌‌లోని యాప్‌‌‌‌‌‌‌‌ను ఆన్‌‌‌‌‌‌‌‌ చేస్తాడు. తను చేరాల్సిన ప్రాంతం వచ్చాక డేటా ఇవ్వగానే ఆ ట్రిప్‌‌‌‌‌‌‌‌కు ఎంతయిందో యాప్‌‌‌‌‌‌‌‌ లెక్కేస్తుంది. ఐదు యాప్‌‌‌‌‌‌‌‌లను ఓకే చేశారు. బీఎల్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌, ఫెయిర్‌‌‌‌‌‌‌‌టిక్‌‌‌‌‌‌‌‌, ఎస్‌‌‌‌‌‌‌‌బీబీ, జుర్చర్‌‌‌‌‌‌‌‌ వెర్కెష్‌‌‌‌‌‌‌‌వెర్బుండ్‌‌‌‌‌‌‌‌, టీసీఎల్‌‌‌‌‌‌‌‌ యాప్‌‌‌‌‌‌‌‌లను వాడొచ్చు. యాప్‌‌‌‌ వాడనోళ్లకు పాత పద్ధతిలోనే టికెట్లని సర్కార్‌‌‌‌ చెప్పింది.