
హైదరాబాద్ : మునుగోడు ఉప ఎన్నికకు అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఉంటుందని సీఈవో వికాస్ రాజ్ తెలిపారు. ప్రతి పోలింగ్ స్టేషన్ లో మైక్రో అబ్జర్వర్‌ని నియమిస్తామని చెప్పారు. అన్ని పోలింగ్ బూత్‌లను కవర్ చేసే విధంగా జనరల్అబ్జర్వర్స్ సూచనల మేరకు సీఏపీఎఫ్ సిబ్బంది పని చేస్తారన్నారు. ఈసీ ఆదేశాలతో మాజీ ఆర్వో జగన్నాథ్‌రావును సస్పెండ్ చేశామని వెల్లడించారు. ఈ నెల 28న ఈ రిపోర్టును ఈసీకి పంపుతామని గురువారం ఆయన ప్రకటనలో పేర్కొన్నారు. భద్రత కల్పించడంలో ఫెయిల్ అయిన డీఎస్పీపైనా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఈసీ ఆదేశించిందని అందులో తెలిపారు. 80 ఏండ్లు పైబడిన సీనియర్‌సిటిజన్స్ కు పోస్టల్ బ్యాలెట్ పద్ధతిలో ఓటు వేసేందుకు అవకాశం ఇస్తున్నామని చెప్పారు. 739 మంది సీనియర్ సిటిజన్స్ పోస్టల్ బ్యాలెట్ కు అప్లై చేసుకుంటే, ఇప్పటి వరకు 624 మంది వినియోగించుకున్నారని పేర్కొన్నారు. మునుగోడు బైపోల్ కు సంబంధించి ఇప్పటి వరకు 21 ఎఫ్ఆర్ఐలు నమోదు కాగా రూ.2.95 కోట్లు సీజ్‌చేశామన్నారు. ఎక్సైజ్‌శాఖ 55 మందిని అరెస్ట్ చేసి, 123 కేసులు నమోదు చేసిందన్నారు.
పోలింగ్ కేంద్రాల వద్ద కేంద్ర బలగాలు పెట్టండి
సీఈవోను కోరిన బీజేపీ లీగల్‌సెల్
మునుగోడులోని పోలింగ్ స్టేషన్ల వద్ద కేంద్ర బలగాలతో భద్రత కల్పించాలని మాజీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు కోరారు. ఈ మేరకు గురువారం బుద్ధభవన్-లో సీఈవో వికాస్‌రాజ్-ను బీజేపీ లీగల్ సెల్ బృందం కలిసి.. వినతి పత్రం అందజేసింది. అనంతరం రాంచందర్‌రావు మీడియాతో మాట్లాడారు. ప్రతి పోలింగ్ బూత్ వద్ద సీఆర్-పీఎఫ్ బలగాలను పెట్టాలని సీఈవోను కోరినట్లు చెప్పారు. అన్ని పోలింగ్ స్టేషన్లలో లైవ్ స్ట్రీమింగ్, వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేయాలని చెప్పామన్నారు. బీజేపీని బ్లేమ్ చేసేందుకే టీఆర్ఎస్ నేతలు మొయినాబాద్ ఫాంహౌజ్ డ్రామాకు తెరలేపారని రాంచందర్‌రావు మండిపడ్డారు. ఫాంహౌజ్-లో పట్టుబడినవారితో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. అక్కడ కోట్ల రూపాయలు ఉన్నాయని ఆరోపించిన పోలీసులు.. వాటిని ఎందుకు బయటపెట్టలేదో చెప్పాలన్నారు. ఓటర్లను ప్రభావితం చేసేందుకు ఎఫ్ఐఆర్-లో బీజేపీని చేర్చారని విమర్శించారు. ఈ వ్యవహారంపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ చేపట్టాలని ఎన్నికల అధికారిని కోరినట్లు వెల్లడించారు. సీఈవోను కలిసిన వారిలో బీజేపీ అధికార ప్రతినిధి, అడ్వకెట్ రచనా రెడ్డి ఉన్నారు.