
‘దిల్’ సినిమా లోగోతో పోస్టర్ డిజైనర్‌గా కెరీర్ ప్రారంభించిన విష్ణువర్థన్ రెడ్డి (వివ రెడ్డి).. ఇప్పటివరకు 500 పైగా సినిమాలకు లోగో డిజైన్ చేశాడు. నటుడిగానూ పలు సినిమాల్లో మెప్పించాడు. ప్రస్తుతం ‘ఓ తండ్రి తీర్పు’ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. అలాగే ద స్కూల్, జయతు జయతు చిత్రాల్లో విలన్ పాత్ర పోషిస్తున్నాడు. నంద, లగ్గం సినిమాల్లో ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నాడు. పాతికేళ్ల కెరీర్‌లో యాక్టర్‌గా బిజీగా ఉంటూనే పబ్లిసిటీ డిజైనర్‌గా క్రేజీ ప్రాజెక్టులకు వర్క్ చేస్తుండడం పట్ల వివ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు.