
రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ఢీ కొట్టి అధికారంలోకి రావాలని కాంగ్రెస్ విశ్వప్రయత్నాలు చేస్తోంది. సెప్టెంబర్ మూడో నెలలో అభ్యర్థుల లిస్ట్ ప్రకటించే అవకాశం కూడా ఉంది. ఈ క్రమంలో మధుయాష్కీ గౌడ్ నివాసంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి భేటీ అయ్యారు. రాబోయే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఇరువురు చర్చించారు.
కాగా బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన పొంగులేటికి కాంగ్రెస్ హైకమాండ్.. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీ-పీసీసీ) కో-ఛైర్మన్‌గా నియమించింది. చైర్మన్‌గా మధుయాష్కీ గౌడ్‌ను గతంలోనే నియమించగా.. కో-ఛైర్మన్, కన్వీనర్‌తోపాటు 37 మందితో ఎగ్జిక్యూటివ్ కమిటీని నియమించారు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్.
ALSO READ :వరల్డ్ సమోసా డే.. విందులు, వినోదాలు, సరదాలన్నింటికీ సమోసానే
అటు గాంధీభవన్ లో పోస్టర్లు కలకలం సృష్టిస్తున్నాయి. మధుయాష్కీ గౌడ్ కు వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. సేవ్ ఎల్ బి నగర్ కాంగ్రెస్ అంటూ కొంతమంది గొడలకు పోస్టర్లు అంటించారు. గో బ్యాక్ అంటూ మధుయాష్కీ అంటూ ఆ పోస్టర్లలలో కనిపిస్తు్ంది. పేరాచూట్ నేతలకు టికెట్లు ఇవ్వద్దంటూ పోస్టర్లలో కనిపించడం కలకలం సృష్టిస్తోంది.