
- ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై రౌడీషీట్ ఓపెన్ చేయాలంటూ పోస్టర్లు అంటించిన బీజేపీ కార్పొరేటర్
ఎల్బీనగర్, వెలుగు: ఎల్బీనగర్లో ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డికి వ్యతిరేకంగా వెలిసిన పోస్టర్లు కలకలం రేపాయి. సుధీర్ రెడ్డిపై రౌడీ షీట్ ఓపెన్ చేయాలంటూ రోడ్డుకు ఇరువైపులా పోస్టర్లు అంటించారు. గతంలో ప్రముఖులపై దాడి చేసిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై ఎందుకు రౌడీషీట్ ఓపెన్
చేయలేదంటూ పోస్టర్లలో చంపాపేట్ బీజేపీ కార్పొరేటర్ వంగ మధుసూదన్ రెడ్డి ప్రశ్నించారు. రౌడీరాజ్యంపై కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర గవర్నర్ కి ఫిర్యాదు చేయబోతున్నానని పోస్టర్లలో రాయించాడు.
‘నేను ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేయబోతున్నా. నాతో కలిసి వచ్చే వాళ్లు రావాలి’ అంటూ పోస్టర్లలో ఫోన్ నంబర్‌ను కూడా జత చేశాడు. ఈ పోస్టర్లపై బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. వంగ మధుసూదన్ రెడ్డిపై ఎల్బీనగర్, నాగోల్, వనస్థలిపురం పీఎస్‌లలో ఫిర్యాదు చేశారు.