వరుస విజయాలతో జాతీయ స్థాయిలో గుర్తింపును అందుకున్న రష్మిక.. త్వరలో ‘కాక్‌టెయిల్ 2’ అనే హిందీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొస్తోంది. రష్మికతో పాటు షాహిద్ కపూర్, కృతి సనన్ లీడ్ రోల్స్‌లో నటించిన ఈ చిత్రానికి హోమీ అదాజానియా దర్శకత్వం వహిస్తున్నారు. 2012లో దీపికా పదుకోన్, డయానా, సైఫ్ అలీ ఖాన్ నటించిన సూపర్ హిట్ మూవీ ‘కాక్‌టెయిల్’కు ఇది సీక్వెల్.
ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. మంగళవారం ఈ చిత్రం నుంచి లీడ్ క్యారెక్టర్స్‌కు సంబంధించిన పోస్టర్స్‌ను విడుదల చేశారు. రష్మిక సోషల్ మీడియా ద్వారా వీటిని షేర్ చేసింది. ఇందులో రెడ్ డ్రెస్‌లో ఆమె గ్లామరస్‌గా కనిపిస్తోన్న ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదొక ట్రయాంగిల్ లవ్ స్టోరీలా కనిపిస్తున్నప్పటికీ ఇందులో లెస్బియన్ అంశాన్ని కూడా టచ్ చేసినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇదే నిజమైతే రష్మిక కెరీర్‌లో మరో బోల్డ్ రోల్ అవుతుంది. ఇక ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ జూన్ 19న విడుదల కానుంది. పెళ్లి తర్వాత రష్మిక నుంచి వస్తున్న ఫస్ట్ మూవీ ఇదే కావడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఇదికాక విజయ్ దేవరకొండకు జంటగా ‘రణబాలి’లో ఆమె నటిస్తోంది. అలాగే లేడీ ఓరియంటెడ్ మూవీ ‘మైసా’ రిలీజ్‌కు రెడీ అవుతోంది.
