
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర పంచాయతీ సేవల్లో భాగంగా ఆరుగురు జిల్లాపంచాయతీ అధికారులకు (డీపీఓ) పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి ఎన్. శ్రీధర్ పోస్టింగ్‌లు ఇచ్చారు. కొత్తగా రిక్రూట్ అయినవారిలో భద్రాద్రి కొత్తగూడెం డీపీఓగా బోపన్న అనూష, ములుగు డీపీఓగా యాడారి రేవంత్, సిద్దిపేటకు గోండోళ్ల వినోద్‌కుమార్, వనపర్తికి వనం తరుణ్ చక్రవర్తి, జనగామకు అంగరాజ్ నవీన్, మహబూబ్‌నగర్ డీపీఓగా భాగం నిఖిలశ్రీకు పోస్టింగ్‌లు ఇస్తూ శనివారం ఆయన ఉత్తర్వులు జారీచేశారు. టీజీపీఎస్‌సీ ద్వారా కొత్తగా ఆరుగురు డీపీవోలు సెలక్ట్ అయ్యారు. వీరికి పోస్టింగ్‌లపై పీఆర్, ఆర్‌డీ డైరెక్టర్ సృజన పంపించిన ప్రతిపాదనలను పరిశీలించాక ముఖ్యకార్యదర్శి ఈ మేరకు చర్యలు తీసుకున్నారు.