సెలెక్టెడ్ అభ్యర్థులకు పోస్టింగ్ ఆర్డర్స్ ఇవ్వాలి

సెలెక్టెడ్ అభ్యర్థులకు పోస్టింగ్ ఆర్డర్స్ ఇవ్వాలి

 ముషీరాబాద్,వెలుగు : గురుకుల రిక్రూట్ మెంట్ లో  సెలెక్టైన అభ్యర్థులకు వెంటనే పోస్టింగ్ ఆర్డర్స్ ఇవ్వాలని గురుకుల సెలెక్టెడ్ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కొండ్రపల్లి శీను డిమాండ్ చేశారు.  శుక్రవారం ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, సీఎం పర్సనల్ సెక్రటరీ జైపాల్ రెడ్డిని సెలెక్ట్ అభ్యర్థులతో కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సెలెక్టైన గురుకుల అభ్యర్థులు 60 రోజుల్లోపు విధులో చేరాలని నియామక పత్రాల్లో పేర్కొన్నా.. 3 నెలలు గడిచినా పోస్టింగ్ ఆర్డర్స్ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 

ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని కోచింగ్ తీసుకొని ఎగ్జామ్స్ రాసి సెలెక్టైనా కూడా పోస్టింగ్ ఇవ్వకపోవడం దారుణమన్నారు. విద్యా సంవత్సరం మొదలైనందున ఉపాధ్యాయులు లేక విద్యార్థులు నష్టపోకుండా ప్రభుత్వం చూడాలని విజ్ఞప్తి చేశారు. నియామక పత్రాల్లో సుదీర్ఘకాలంగా నోటిఫికేషన్ పైన పెండింగ్ ఉన్న కేసులపై  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని పరిష్కారించాలని కోరారు. 3 నెలలుగా ఎదురుచూస్తున్న గురుకుల సెలెక్టెడ్ అభ్యర్థులకు పోస్టింగ్ ఆర్డర్స్ ఇచ్చి న్యాయం చేయాలని కోరారు. రవి, భరత్, బాలకృష్ణ, శ్వేత తదితరులు పాల్గొన్నారు.