ఈసీ షాకింగ్ డెసిషన్స్ : కీలకమైన పోలీస్ అధికారులు బదిలీ

ఈసీ షాకింగ్ డెసిషన్స్ : కీలకమైన పోలీస్ అధికారులు బదిలీ

ఎలక్షన్ కమిషన్ సంచలన నిర్ణయాలు తీసుకుంటుంది. కంప్లయింట్ వస్తే చాలు.. ఏ మాత్రం అలక్ష్యం చేయకుండా యాక్షన్ తీసుకుంటోంది. ఇందులో భాగంగానే.. పలు రాజకీయ పార్టీలు హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ ఓఎస్డీ   రాధాకృష్ణ రావుపై కంప్లయింట్ చేశాయి. ఆయన వ్యవహార శైలిని ప్రశ్నించాయి. రిటైర్ అయిన తర్వాత కూడా.. స్పెషల్ ఆన్ డ్యూటీ కింది.. హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ ఓఎస్డీగా బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించటాన్ని సవాల్ చేశాయి రాజకీయ పార్టీలు. అదే విధంగా పలువురు పోలీస్ అధికారులపైనా అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ.. తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు చేశాయి ఆయా రాజకీయ పార్టీలు. ఈ క్రమంలో ఈసీ ఆదేశాలతో పలువురు పోలీసు ఉన్నాతాధికారులను బదిలీ చేశారు.  ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.  ఇందులో కొంతమందిని  హైదరాబాద్ పోలీస్  అకాడమీకి అటాచ్ చేశారు.  

తెలంగాణ రాష్ట్రంలో పలువురు ఐపీఎస్‌ అధికారులకు పోస్టింగ్‌లు

 

  • టీఎస్‌పీఏ జాయింట్ డైరెక్టర్‌గా రంగనాథ్‌
  • టీఎస్‌పీఏ డిప్యూటీ డైరెక్టర్‌గా రాజేంద్ర ప్రసాద్
  • సీఐడీ ఎస్పీగా శ్రీనివాస్ రెడ్డి
  • గ్రే హౌండ్స్ ఎస్పీగా వెంకటేశ్వర్లు
  • సౌత్ వెస్ట్ జోన్ డీసీపీగా నితికా పంత్
  • సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీగా రోహిత్ రాజ్
  • ట్రాఫిక్ డీసీపీగా ఆర్‌.వెంకటేశ్వర్లు
  • పెద్దపల్లి డీసీపీగా సునీతా మోహన్