పిల్లల హక్కుల రక్షణలో టీచర్ల పాత్ర కీలకం : లాల్ సింగ్ శ్రీనివాస నాయక్

పిల్లల హక్కుల రక్షణలో టీచర్ల పాత్ర కీలకం :  లాల్ సింగ్ శ్రీనివాస నాయక్

వికారాబాద్, వెలుగు: పిల్లల హక్కులను రక్షించడం, వారికి సురక్షితమైన వాతావరణం కల్పించడంలో టీచర్ల పాత్ర కీలకమని వికారాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ లాల్ సింగ్ శ్రీనివాస నాయక్ అన్నారు. 

వికారాబాద్‌‌లో చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్లుగా నామినేట్ అయిన ఉపాధ్యాయుల కోసం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం ఒకరోజు సెన్సిటైజేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. పాఠశాలల్లో పిల్లలపై జరిగే వేధింపులు, బాల కార్మిక వ్యవస్థ, బాల్య వివాహాలు, లైంగిక దాడులు, సైబర్ నేరాల టీచర్లు ముందుగానే గుర్తించి అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. ఎస్పీ స్నేహ మెహ్రా, అధికారులు పాల్గొన్నారు.