గురుకుల స్టూడెంట్ డెడ్ బాడీకి రీ పోస్టుమార్టం

గురుకుల స్టూడెంట్  డెడ్ బాడీకి రీ పోస్టుమార్టం
  • మూడు నెలల తర్వాత ఎఫ్ఐఆర్

బాల్కొండ, వెలుగు: నిజామాబాద్  జిల్లా మెండోరా సోషల్  వెల్ఫేర్  గర్ల్స్​ హాస్టల్  స్టూడెంట్  సాయి లిఖిత(13) డెడ్ బాడీకి మంగళవారం ఆదిలాబాద్  జిల్లా తాంసిలో మంగళవారం రీ పోస్టుమార్టం నిర్వహించారు. మూడు నెలల తర్వాత ఆమె తల్లిదండ్రులు మెండోరా పోలీస్ స్టేషన్​లో తమ కూతురు మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ కంప్లైంట్  చేశారు. గత ఏడాది డిసెంబర్  6న ఫుడ్  పాయిజన్ తో అస్వస్థతకు గురైన ఆమెను హైదరాబాద్  నిలోఫర్ కు తరలించారు. చికిత్స పొందుతూ అదే నెల 17న చనిపోయింది. బంధువులు డెడ్ బాడీ తో పోచంపాడ్  హాస్టల్  ఎదుట ఆందోళన చేపట్టగా, న్యాయం చేస్తామని పోలీసులు హామీ ఇచ్చారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేయగా, సీపీ సాయి చైతన్య ఆదేశాలతో ఎస్సై సుహాసిని ఆధ్వర్యంలో రీ పోస్టుమార్టం 
నిర్వహించారు.