క్రికెట్ అభిమానులకు షాక్: IPL వాయిదా

క్రికెట్ అభిమానులకు షాక్: IPL వాయిదా

అంతా అనుకున్నట్లుగానే జరిగింది. అత్యంత ప్రజాదరణ కలిగిన ఐపీఎల్ టోర్నీ వాయిదా పడింది. కరోనా వైరస్ ఎఫెక్ట్ తో ఏప్రిల్ -15 వరకు  ఐపీఎల్ ను వాయిదా వేసింది BCCI. దేశంలో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో.. ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఐపీఎల్ వాయిదా వేసినట్టు చెప్పారు అదికారులు. కరోనా ఎఫెక్ట్ తో IPL వాయిదా వేసుకుంటేనే బెటరని గురువారం సూచించింది కేంద్రం. నిర్వాహకులు కూడా చివరివరకు వేచిచూసే ధోరణిలోనే ఉన్నారని తెలిపింది. మ్యాచ్ లు పెడదామనే ఆలోచనలో ఉన్నప్పటికీ.. కేంద్రం సూచనలతో పాటు.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితులతో వాయిదా నిర్ణయం తీసుకున్నారు.

ఐపీఎల్ ను వాయిదా వేయాలంటూ  వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు కేంద్రాదానికి లెటర్ రాయడం, కోర్టులో పిటిషన్లు దాఖలవ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.  అలాగే  విదేశీయులకు వీసాలు నిలిపివేయాలని కేంద్రం తీసుకున్న నిర్ణయంతో .. పలు దేశాల క్రికెటర్లు ఇండియాకు రావడానికి కూడా వీలు లేకుండా పోయింది. దీంతో పాటు స్టేడియాలకు ప్రజలు రాకూడదనే రూల్ ఉండటం.. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని IPL ను వాయిదా వేయక తప్పలేదు BCCI కి. అయితే దీనినిపై మరో డేట్, మ్యాచ్ ఆడే ప్రదేశాల షెడ్యూల్ త్వరలోనే BCCI అనౌన్స్ చేసేలా తెలుస్తోంది.