జెన్కో ఉద్యోగ పరీక్ష వాయిదా

జెన్కో ఉద్యోగ పరీక్ష వాయిదా

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: తెలంగాణ స్టేట్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (జెన్కో)లో అసిస్టెంట్ ఇంజినీర్(ఏఈ), కెమిస్ట్ ఉద్యోగాల నియామక రాత పరీక్ష వాయిదా పడింది. ఎలక్షన్‌‌‌‌‌‌‌‌  కోడ్  కారణంగా ఈ నెల 31న జరగాల్సిన పరీక్షను వాయిదా వేస్తూ జెన్కో నిర్ణయం తీసుకుంది.

ఈ మేరకు జెన్కో సీఎండీ రిజ్వీ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల కోడ్‌‌‌‌‌‌‌‌ ముగిసిన తరువాత పరీక్ష తేదీని ప్రకటిస్తామని వెల్లడించారు. జెన్కోలో 339 అసిస్టెంట్ ఇంజినీర్, 60 కెమిస్ట్ పోస్టుల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ వెలువడింది.