పొటాషియం.. ఈ ఒక్కటి చాలు బాడీ మొత్తాన్ని సెట్ చేయడానికి..!

పొటాషియం.. ఈ ఒక్కటి చాలు బాడీ మొత్తాన్ని సెట్ చేయడానికి..!

ఫాస్ట్ ఫుడ్, ఇన్స్టంట్, ఎనర్జీ డ్రింక్స్ అంటూ ఫుడ్ సిస్టంలో వచ్చిన ట్రెండ్స్.. బాడీకి ఏం అవసరం.. ఏం తింటున్నాం అనే కనీస అవగాహన లేకుండా చేస్తున్నాయి. కలర్, టేస్టీ, వెరైటీ ఫుడ్ కు అలవాటు పడి.. బాడీకి కావాల్సిన న్యూట్రిషన్స్ గురించి మాత్రం పట్టించుకునే పరిస్తితి లేదు ప్రజెంట్ జనరేషన్ లో. విటమిన్ లోపం, ప్రోటీన్ లోపం అంటూ చాలా వరకు ఏదో ఒక సమస్యతో బాధపడేవారే ఎక్కువ.

మానవ శరీర నిర్మాణం.. ఒకదానిపై ఒకటి ఆధారపడిన అవయాలతో నిర్మితమై ఉంటుంది. అదే విధంగా బాడీకి కావాల్సిన న్యూట్రిషన్స్ ఒకదానిపై మరోటి ఆధారపడి ఉంటాయి. అయితే బాడికి కవాల్సిన మూలకాలు చాలా ఉన్నప్పటికీ అతిముఖ్యమైనది పొటాషియం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. బాడీలో పొటాషియం లెవల్స్ సమృద్ధిగా ఉంటే.. దాదాపు అన్నింటిని సమన్వయం చేస్తుందని అంటున్నారు. మరి పొటాషియం చేసే మేలేంటో ఓ సారి చూద్దాం. 

పొటాషియం బాడీ మెటబాలిజం కీలక పాత్ర పోషించే చాలా ముఖ్యమైన ఖనిజం.. అంతకు మించీ ఎలక్ట్రోలైట్. బాడీ ఫ్లూయిడ్స్ ను బ్యాలెన్స్ చేయడం,నరాల సంకేతాలు, కండరాల సంకోచాలను నియంత్రించడంలో సహాయపడుతుంది. 


లభించే పదార్థాలు:

అరటిపండ్లు, పాలకూర, అవకాడోలు, చిలగడ దుంపలు, బీన్స్ వంటి ఆహారాలలో సమృద్ధిగా లభించే పొటాషియం గుండె ఆరోగ్యం, మూత్రపిండాల పనితీరు,  మొత్తం కణ కార్యకలాపాలకు చాలా అవసరం. తగిన మొత్తంలో తీసుకుంటే పొటాషియం చాలా ఆరోగ్యాన్ని ఇస్తుంది. 

 రక్తపోటును నియంత్రిస్తుంది

శరీరంలో అధిక రక్తపోటుకు ప్రధాన కారణమైన కారణం సోడియం. దీని ప్రభావాలను ఎదుర్కోవడానికి పొటాషియం సహాయపడుతుంది. రక్తనాళాల గోడలను సడలించడం , మూత్రం ద్వారా సోడియం బయటకు పంపడం ద్వారా బ్లడ్ ప్రెజర్ స్థాయిలను నియంత్రిస్తుంది.  రక్తపోటు, హృదయ సంబంధ సమస్యలను నివారించడంలో తోడ్పడుతుంది. 

 గుండె ఆరోగ్యం

పొటాషియంను నిరంతరం తీసుకోవడం వల్ల గుండె కండరాల సంకోచ, వ్యాకోచాలు సరిగ్గా ఉంటాయి. బాడీలో పొటాషియం  తక్కువ ఉంటే గుండె పనితీరును దెబ్బతీస్తుంది. పొటాషియం లోపిస్తే.. సడెన్ గా గుండె ఆగిపోయే ప్రమాదం ఉంది. రెగ్యులర్ గా పొటాషియం రిచ్ ఫుడ్ తీసుకోవడం వల్ల స్ట్రోక్, గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది.

 కండరాల తిమ్మిరి నివారిస్తుంది

చాలా మందికి కాసేపు అలా ఒరిగి కూర్చుంటే కండరాలు బగ్గరగా అయిపోయి తిమ్మిరి పట్టినట్లు అవుతుంది. దీనికి కారణం బాడీలో పొటాషియం సమపాళ్లలో లేకపోవడమే.  ఈ మూలకం లేకపోవడం వల్ల తిమ్మిర్లు, కండరాల నొప్పులు, వీక్ నెస్ మొదలైన సమస్యలకు దారి తీస్తుంది.

  నాడీ వ్యవస్థ పనితీరును మెరుగు పరుస్తుంది

మానవ మెదడు, శరీరం మధ్య కమ్యూనికేషన్ జరిగేది నాడీ వ్యవస్థ వల్లనే. అంటే మైండ్ ఏం చెప్తే బాడీలోని పార్ట్స్ అవి చేస్తుంటాయి. అందుకు సంబంధించి విద్యుత్ సంకేతాలను మోసుకెళ్లేది నాడులే. బాడీలో తగినంత పొటాషియం లేకుంటే నరాలు, నాడుల ప్రేరణ మందగిస్తుంది. దీని వలన చాలా ప్రాబ్లమ్స్ వచ్చే  అవకాశం ఉంది. 

శరీరంలో ఫ్లూయిడ్స్ ను సమతుల్యం చేస్తుంది

శరీరలో ఫ్లూయిడ్స్ (ద్రవాలు) మధ్య సమతుల్యతను పెంపొందించడంలో పొటాషియం కీలక పాత్ర పోషిస్తుంది. అందుకోసం ఇది సోడియంతో కలిసి పనిచేస్తుంది. ఆరోగ్యకరమైన కణాల పనితీరు, సరైన జీర్ణక్రియ, సరైన రక్త పరిమాణాన్ని, ప్రవాహాన్ని నిర్వహించడానికి ఈ సమతుల్యత చాలా అవసరం. 

కిడ్నీలో రాళ్ల నివారణ

పండ్లు, కూరగాయల నుంచి వచ్చే పొటాషియం కిడ్నీలో క్యాల్షియం లోపాన్ని నియంత్రిస్తుంది. క్యాల్షియం ఆధారంగా ఏర్పడే రాళ్లను తగ్గిస్తుంది. అదే విధంగా బాడీలో ఉండే వ్యర్థ పదార్థాలు, కెమికల్స్ ను మూత్రం ద్వారా బయటకు పంపించడంలో సహాయపడుతుందది. దీనివల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా తగ్గిస్తుంది. మద్దతు ఇస్తుంది.

 ఎముక ధృఢంగా ఉండేందుకు తోడ్పడుతుంది

బాడీలో ఆసిడ్స్ ను సమన్వయం చేయడం వలన కాల్షియం నిల్వలను సంరక్షిస్తుంది. అంతేకాకుండా ఖనిజ గ్రహించడంలోనూ ఉపయోగపడుతుంది. దీనిద్వారా ఎముకల ఆరోగ్యం మెరుగుపడేలా దోహదపడుతుంది. ఎముకలలో పగుళ్ల ప్రమాదం ఉన్న వృద్ధులకు ఇది చాలా ముఖ్యం.

 బ్లడ్ షుగర్ నియంత్రణకు ఉపయోగపడుతుంది

పొటాషియం ఇన్సులిన్ సెన్సిటివిటీతో పాటు గ్లూకోజ్ జీవక్రియలో సహాయపడుతుంది. తక్కువ పొటాషియం ఉన్న వ్యక్తుల్లో ఇన్సులిన్ గ్రహించే శక్తి తక్కువగా ఉంటుంది. ఇది టైప్ 2 డయాబెటిస్ కు దారి తీస్తుంది. అందువల్ల పొటాషియం అధికంగా ఉండే ఆహారాలను చేర్చడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంటాయి.