
యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల జంటగా ‘సవారీ’ ఫేమ్ సాహిత్ మోత్కురి తెరకెక్కిస్తున్న చిత్రం ‘పొట్టేల్’. నిశాంక్ రెడ్డి కుడితి, సురేష్ కుమార్ సడిగే నిర్మిస్తున్నారు. గురువారం ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలతో సినిమా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు. దసరాకి ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.
తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాకి దసరా పర్ఫెక్ట్ రిలీజ్ టైమ్ అని, దసరా హాలిడేస్ సినిమాకు అడ్వాంటేజ్ అవుతాయన్నారు మేకర్స్. ఇందులో అనన్య, యువచంద్ర డీ గ్లామర్ లుక్‌లో వింటేజ్ గెటప్‌లలో కనిపించనున్నారు. అజయ్, ప్రియాంక శర్మ, తనస్వి చౌదరి, నోయల్ సీన్, ఛత్రపతి శేఖర్, శ్రీకాంత్ అయ్యంగార్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నాడు.