
- తాగునీటి కోసం యుద్ధాలు జరిగేవి
రామచంద్రాపురం, వెలుగు: కాంగ్రెస్అధికారంలో ఉన్నప్పుడు పటాన్చెరు ప్రాంతానికి కాలుష్యాన్ని కానుకగా ఇచ్చిందని మంత్రి హరీశ్ రావు విమర్శించారు. మంగళవారం ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి తన సొంత నిధులతో 250 మంది దివ్యాంగులకు స్కూటీలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్టుగా హాజరైన మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ పటాన్ చెరు ప్రాంతంలో తాగేందుకు కూడా వీలులేని పొల్యూటెడ్వాటర్ఉండేదని, తాగునీటి ఇక్కడ నీటి యుద్ధాలు జరిగాయని గుర్తుచేశారు. బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాతే పొల్యూషన్ తగ్గించి ప్రతి ఇంటికి శుద్ధమైన జలాలు అందిస్తున్నామన్నారు.
కరెంటు కోతలు, పవర్ హాలీడేస్ కారణంగా కంపెనీలు మూతపడి ఎంతోమంది ఉద్యోగాలు పోయాయని, ఇప్పుడు కరెంట్ ఎలా వస్తుందో తెలిసిందేనన్నారు. సెంట్రల్‌లో ఉన్న బీజేపీ ప్రజల మధ్య చిచ్చు పెడుతోందని, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెంచి.. అదానీకి పంచే పని చేస్తోందని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌తోనే ప్రగతి సాధ్యమని బీజేపీని నమ్ముకుంటే అధోగతేనని, ప్రజలు జాగ్రత్తగా ఉంచాలని సూచించారు. దివ్యాంగుల ఆత్మగౌరవాన్ని పేంచేలా స్కూటీలు అందించిన ఎమ్మెల్యేను అభినందించారు. అనంతరం రూ. 20 కోట్లతో కొత్తగా నిర్మించే వాటర్ పైప్‌లైన్ వర్కులను శంకుస్థాపన చేశారు.
సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఏర్పాటు చేస్తాం ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సబ్‌రిజిస్ట్రేషన్ ఆఫీస్‌ను తర్వలోనే ఏర్పాటు చేస్తామని మంత్రి హరీశ్ రావు హామీ ఇచ్చారు. రూ. 250 కోట్లతో నిర్మించే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌కు సీఎం కేసీఆర్ త్వరలోనే శంకుస్థాపన చేయనున్నారని వెల్లడించారు. సుల్తాన్‌పూర్‌లో 200 ఎరాకల్లో మెడికల్డివైజ్ పార్కు ఏర్పాటు చేశామని, తొందర్లోనే ఎల్ఈడీ పార్కు తీసుకొస్తామని చెప్పారు. ఉస్మాన్‌నగర్‌లో 400 ఎకరాల్లో ఐటీ కారిడార్ డెవలప్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ మంజుశ్రీ, మాజీ ప్రొటెం స్పీకర్ భూపాల్ రెడ్డి, అసిస్టెంట్ కలెక్టర్ వీరారెడ్డి, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.