విద్యుత్‌‌‌‌ సంస్థల మనుగడలో ఇంజనీర్ల పాత్ర కీలకం: సీఎం రేవంత్

విద్యుత్‌‌‌‌ సంస్థల మనుగడలో ఇంజనీర్ల పాత్ర కీలకం: సీఎం రేవంత్

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: విద్యుత్‌‌‌‌ సంస్థల మనుగడలో ఇంజనీర్ల పాత్ర కీలకమని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కస్టమర్లకు మరింత మెరుగైన సేవలు అందించాలని సీఎం ఆదేశించారు. మంగళవారం తెలం గాణ పవర్‌‌‌‌ ఇంజనీర్స్‌‌‌‌ అసోసియేషన్‌‌‌‌ రాష్ట్ర అధ్యక్షుడు రత్నాకర్‌‌‌‌రావు, సెక్రటరీ జనరల్‌‌‌‌ సదానందం ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం సీఎం రేవంత్‌‌‌‌రెడ్డిని కలిసి న్యూఇయర్‌‌‌‌ విషెస్ చెప్పారు. 

విద్యుత్ సంస్థల్లో డైరెక్టర్ల నియామకం త్వరగా చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. విద్యుత్ సంస్థల్లోని సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. తమ సమస్యలకు సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారని అసోసియేషన్ అధ్యక్షుడు రత్నాకర్ రావు, సెక్రటరీ జనరల్ సదానందం తెలిపారు.ఈ కార్యక్రమంలో టీఎస్‌‌‌‌ఎస్‌‌‌‌పీడీసీఎల్‌‌‌‌ కంపెనీ సెక్రటరీ జనప్రియ, టెక్నికల్ సెక్రటరీ గోపాలకృష్ణ, విద్యుత్ సౌధ  బ్రాంచ్ సెక్రటరీ మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.