'హరిహర వీరమల్లు' నుంచి పవర్ గ్లాన్స్

'హరిహర వీరమల్లు' నుంచి పవర్ గ్లాన్స్

ఇవాళ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన నటిస్తున్న 'హరిహర వీరమల్లు' సినిమా నుంచి తాజాగా అప్ డేట్ వచ్చింది. ఈ మూవీ నుండి స్పెషల్ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పవర్ గ్లాన్స్ లో పవన్ కుస్తీ వీరులను ఎత్తిపడేస్తూ.. తొడకొట్టడం చూడవచ్చు. "మెడల్ని వంచి, కథల్ని మార్చి.. కొలిక్కితెచ్చే పనెట్టుకోని తొడకొట్టాడో.. తెలుగోడు" అంటూ బ్యాగ్రౌండ్ వాయిస్ వినిపిస్తోంది. ఈ వీడియో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటోంది. ఈ వీడియో సినిమాపై మరింతగా ఆసక్తిని పెంచుతోంది. 

చారిత్రక నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ గజదొంగ పాత్రలో నటిస్తున్నాడు. ఎ.ఎం.రత్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. అర్జున్ రామ్ పాల్ కీలకమైన పాత్రను పోషిస్తుండగా.. నిధి అగర్వాల్ కథానాయికగా అలరించనుంది. వచ్చే ఏడాది ఈ సినిమా విడుదల కానుంది.