ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసిన మంత్రి జగదీశ్వర్ రెడ్డి

ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసిన మంత్రి జగదీశ్వర్ రెడ్డి

సామాన్యులు ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే చర్యలు తీసుకునే పోలీసులు ఓ మంత్రి విషయంలో మాత్రం వాళ్లే నిబంధనలు అతిక్రమించారు. ట్రాఫిక్ ను ఆపి మరీ మంత్రి దర్జాగా రాంగ్ రూట్ లో వెళ్లేందుకు ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. భువనగిరి శివారులో హైదరాబాద్-వరంగల్  జాతీయ రహదారిపై రాంగ్ రూట్ లో ప్రయాణించారు విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి. ఆయన వెంట పలువురు ప్రజా ప్రతినిధుల కార్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. రైట్ రూట్ లో హైదరాబాద్ వెళ్లే వాహనదారులను రోడ్డుపై ఎండలోనే ఆపేశారు పోలీసులు. జగదీశ్వర్ రెడ్డి వెళ్లే వరకు రోడ్డుపై ట్రాఫిక్ ను నిలిపివేశారు. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎవరైనా రోడ్డుపై వెళ్లాలంటే సరైన మార్గంలో వెళ్లాలి...అలా కాదని అధికారం ఉందిలే అని ఇష్టమొచ్చినట్లు వెళ్తామంటే ఎట్లా అని ప్రశ్నిస్తున్నారు వాహనదారులు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న మంత్రి జగదీశ్వర్ రెడ్డి ..ఎవరైనా తప్పు చేస్తే బుద్ది చెప్పాల్సిన ఆయనే తప్పు చేస్తే ఎట్లా అని నిలదీస్తున్నారు స్థానికులు. మంత్రికి ఒక రూల్ సామాన్యులకు మరోక రూలా అంటూ ప్రశ్నిస్తున్నారు. అన్నీ తెలిసిన పోలీసులు కూడా రాంగ్ రూట్ లో వెళ్తున్న మంత్రికి రైట్ రైట్ చెబుతూ..సరైన మార్గంలో వెళ్తున్న వాహనదారులను ఆపేసి రోడ్డు క్లియర్ చేయడం ఎంత వరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తున్నారు ప్రజలు. ట్రాఫిక్స్ రూల్ బ్రేక్ చేస్తే జరిమానాల పేరుతో వేలకు వేలు వసూలు చేసే పోలీసులు..మరి మంత్రి జగదీశ్వర్ రెడ్డికి ఎలాంటి ఫైన్ లు వేస్తారు? మంత్రి కదా అని వదిలేస్తారా? లేక రూల్స్ సామాన్యులకే వర్తిస్తాయని సరిపెడతారా? పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది వేచి చూడాల్సిందే. 

మరిన్ని వార్తల కోసం

వ్యాక్సినేషన్​ జల్దీ పూర్తి కావాలె

317పై అప్పీల్స్ అన్నీ పక్కకే!