ముషీరాబాద్, వెలుగు: పలుచోట్ల సోమవారం విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు అజామాబాద్ ఏడీఈ నాగేశ్వరరావు తెలిపారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు అజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా, అచ్చయ్య నగర్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తామన్నారు.
మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల వరకు ఆర్టీసీ ఎక్స్ రోడ్, డైరా మార్కెట్ లైన్ ప్రాంతాల్లో, సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు నారాయణగూడ, సెంట్రల్ ఎక్సైజ్ కాలనీతో పాటు పరిసర ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడుతుందని తెలిపారు.
