రామ్నగర్, అడిక్మెట్లలో నేడు కరెంట్ కట్

రామ్నగర్, అడిక్మెట్లలో నేడు కరెంట్ కట్

ముషీరాబాద్, వెలుగు: విద్యుత్ లైన్ మెయింటెనెన్స్, చెట్ల కొమ్మల తొలగింపు కారణంగా శుక్రవారం అజమాబాద్ పరిధిలో కరెంట్​సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏడీఈ  జి నాగేశ్వరరావు తెలిపారు. శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు అడిక్​మెట్, రామ్ నగర్ గుండు, బాలాజీ నగర్ పరిసర ప్రాంతాల్లో మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు జామై ఉస్మానియా, బౌద్ధ నగర్  ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉండదన్నారు. పనులు త్వరగా పూర్తయితే నిర్ణీత సమయం కంటే ముందే విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామన్నారు.