'రుద్రుడు' నుంచి స్పెషల్ గ్లింప్స్

'రుద్రుడు' నుంచి స్పెషల్ గ్లింప్స్

రాఘవ లారెన్స్ లేటెస్ట్ గా నటించిన చిత్రం 'రుద్రుడు'. లారెన్స్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా నుండి తాజాగా స్పెషల్ గ్లింప్స్​ను మేకర్స్ విడుదల చేశారు. ఇందులో భారీ యాక్షన్ తో లారెన్స్ ఆసక్తిరేపాడు. లారెన్స్ రగ్గడ్ లుక్ లో కనిపించాడు. ఈవిల్ ఈజ్ నాట్ బోర్న్, ఇట్స్ క్రియేటడ్ అనే ట్యాగ్ లైన్ సినిమాలో లారెన్స్ పాత్రని తెలియజేస్తోంది. యాక్షన్ సీక్వెన్స్ బాగా కొరియోగ్రఫీ చేశారు. జి.వి. ప్రకాష్ కుమార్ నేపధ్య సంగీతం యాక్షన్ ని మరింతగా ఎలివేట్ చేసింది. ఈ గ్లింప్స్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

కతిరేశన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌.. 2023లో ఏప్రిల్ 14న విడుదల కానుంది. షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఫైవ్ స్టార్ క్రియేషన్స్ ఎల్‌ఎల్‌పి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, కతిరేశన్ సమర్పిస్తున్నారు. ఈ చిత్రంలో లారెన్స్ సరసన ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటిస్తోంది. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఆర్ డి రాజశేఖర్-ఐఎస్ సి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.