అన్‌స్టాపబుల్‌ షోలో పవర్ స్టార్

అన్‌స్టాపబుల్‌  షోలో పవర్ స్టార్

టాలీవుడ్ ప్రేక్షకులకి అన్‌స్టాపబుల్‌ షో ఒక పెద్ద సర్ ప్రైజ్ ఇవ్వనుంది. సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులతో చిట్ చాట్ చేసే బాలయ్య షోలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కనిపించనున్నాడు. ఈ ఎపిసోడ్ కు సంబంధించిన షూటింగ్ అన్నపూర్ణ స్టుడియోలో అన్‌స్టాపబుల్‌-2 సెట్లో చిత్రీకరిస్తున్నారు. షూటింగ్ కోసం పవన్ కల్యాన్ అన్నపూర్ణ స్టూడియోకి చేరుకోవడంతో అక్కడ అభిమానుల కోలాహలం నెలకొంది. భారీ సంఖ్యలో ఫ్యాన్స్ అన్నపూర్ణ స్టూడియో వద్దకు చేరుకుంటున్నారు. ఎపిసోడ్ షూటింగ్ కు సంబంధించిన వెల్కం ఫ్లెక్సీలు కనిపించడంతో వారిలో ఉత్సాహానికి హద్దుల్లేకుండా పోయింది.

పవన్ తో పాటు డైరెక్టర్ క్రిష్, త్రివిక్రమ్ సైతం షూటింగ్ కు హాజరయ్యారు. ఇప్పటి వరకు ఎలాంటి షోల్లో కనిపించని పవన్, అన్‌స్టాపబుల్‌కి రావడంతో షోకి మరింత క్రేజ్ పెరిగింది. పవన్ బాలయ్యతో తాను తీయబోయే సినిమాలపై మాట్లాడుతాడా లేక రాజకీయాలపై చర్చిస్తాడా అన్న విషయాలపై అభిమానుల్లో ఆసక్తి రేపుతుంది. బాలయ్య ఎక్స్ పవన్ అని ఉన్న అన్ స్టాపబుల్ సెట్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.