
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Power star pawan kayan) హీరోగా చేస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్(Ustaad bhagath singh). డైనమిక్ డైరెక్టర్ హరీష్ శంకర్(Harish shankar) డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ.. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా నుండి తాజాగా రిలీజైన ఫస్ట్ గ్లింప్స్ కు పవన్ ఫ్యాన్స్ నుండి క్రేజీ రెస్పాన్స్ వచ్చింది.
భగత్ సింగ్ గా పవన్ లుక్ కూడా నెక్స్ట్ లెవల్లో ఉంది. ఈ చిన్న గ్లింప్స్ తో సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఇక తాజాగా ఈ సినిమా నుండి మరో అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమా తాజా షెడ్యూల్ జులై 2 ఆదివారం రోజున మొదలైంది. ఈ షెడ్యూల్ పవన్ కళ్యాణ్ కూడా పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫొటోస్ ను ఆడియన్స్ తో పంచుకున్నారు దర్శకుడు హరీష్ శంకర్. ఈ ఫొటోస్ కు "కొన్ని బంధాలు మారవు" అనే క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం దీనికి సంబందించిన ఫోటీస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.