కేంద్ర పథకాలను రాష్ట్రంలో అమలు చేయట్లే : ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్

కేంద్ర పథకాలను రాష్ట్రంలో అమలు చేయట్లే : ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్

ఉప్పల్, వెలుగు: కేంద్ర పథకాలను రాష్ట్రంలోని బీఆర్ఎస్ సర్కారు అమలు చేయట్లేదని ఉప్పల్ సెగ్మెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మండిపడ్డారు. బుధవారం ఉప్పల్ పరిధి నాచారం, మల్లాపూర్ ఏరియాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రభాకర్​కు జనం అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు.

ఆయన మాట్లాడుతూ.. పేదలకు మెరుగైన వైద్యం అందాలనే ఉద్దేశంతో ప్రధాని మోడీ తీసుకొచ్చిన ఆయుష్మాన్ భారత్​ను తెలంగాణలో బీఆర్ఎస్ సర్కారు అమలు చేయట్లేదన్నారు. ఈ ఎన్నికల్లో కమలం గుర్తు ఓటేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ కోరారు. ఆయన వెంట బీజేపీ నాయకులు పోతగాని గోపాల్ గౌడ్, పద్మారెడ్డి, రవి నాయక్ ఉన్నారు.